మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ. పట్టణంలో పట్టణీకరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన కార్మికులపై పని భారం పడుతుందన్నారు. వెంటనే కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. ఆరోగ్య భత్యం వెంటనే విడుదల చేయాలని కోరారు.