కర్లపాలెం: ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

73చూసినవారు
కర్లపాలెం: ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి
కర్లపాలెం మండలంలోని హైలాండ్ సెంటర్ లో బుధవారం సాయంత్రం కర్లపాలెం ఎస్సై రవీంద్ర వాహనాల తనిఖీ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా వాహన చోదకులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్