ఈ నెల 31న దీపావళి పండుగను జరుపుకొని దుర్గి మండల పరిధిలోని గ్రామాల్లో దీపావళి మందుగుండు సామాగ్రి విక్రయించనున్న వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్సై సుధీర్ తెలిపారు. స్టేషన్ లో సోమవారం అయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసు వారి నిబంధనలు ప్రకారం లైసెన్సులు పొందిన వారు మాత్రమే దీపావళి సామాగ్రి అమ్ముకునే అవకాశం ఉందన్నారు. అనుమతులు పొందకుండా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.