మాచర్ల: నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కు పాదం: రవికుమార్

50చూసినవారు
నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపినట్లు గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మాచర్ల ఎక్సైజ్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్దుర్తి, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల పట్టణాలలో నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించామన్నారు. 7కేసులను నమోదు చేసి నాటుసారా తయారీదారులపై నిఘా పెట్టామన్నారు. పల్నాడు జిల్లా ఎక్సైజ్ సూపర్నెంట్ మణికంఠ, పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్