మాచర్ల: ఉపాధి పనులలో అవకతవకలు లేకుండా చూడాలి

59చూసినవారు
మాచర్ల: ఉపాధి పనులలో అవకతవకలు లేకుండా చూడాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు లేకుండా చూడాలని జిల్లా ఉపాధి హామీ అధికారులకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సూచించారు. సోమవారం మాచర్ల పట్టణంలోని పంచాయతీరాజ్ అతిధి గృహంలో జిల్లా ఉపాధి హామీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. పని అడిగిన ప్రతికూలికి పని కల్పించాలని పని లేదు అంటూ ఎవరు అనకూడదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్