అన్నదాతలు సస్యరక్షణ చర్యలు చేపట్టటం ద్వారానే వివిధ పంటలకు వస్తున్న తెగుళ్లను నివారించవచ్చునని మాచర్ల ఏడీఎ జగదీశ రెడ్డి అన్నారు. గురువారం రెంటచింతల మండలం తుమృకోట, పాలువాయిలలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. సేంద్రీయ ఎరువులో వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. వేసవిలో దుక్కులు దున్ని ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేయాలన్నారు.