మాచర్ల: నాగార్జునకొండను సందర్శించిన పర్యాటకులు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆదివారం సందర్శించారు. పర్యాటకులు విజయపురి సౌత్ లోని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలలో నాగార్జునకొండకు చేరుకున్నారు. కొండలో నెలకొల్పిన బుద్ధుని అవశేషాలను, బుద్ధుని విగ్రహాన్ని, మ్యూజియంను ఎంతో ఆసక్తిగా తిలకించారు.