మాచర్ల: డాక్టర్ల నిర్లక్ష్యంతో కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి

67చూసినవారు
మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం బాలింత మృతిచెందింది. బంధువుల వివరాల మేరకు వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాకి చెందిన ఈదమ్మ (25) కాన్పు కోసం మాచర్ల ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం వలనే ఈదమ్మ మరణించిందని బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా ఈదమ్మకి రక్తశాతం తక్కువగా ఉండటం వలనే మృతి చెందిందని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉదయభాను వివరణ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్