ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంగళగిరి పరిధి నూతక్కికి చెందిన డాక్టర్ నూతక్కి ఆనందరావును నియమిస్తూ సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరి పెన్షనర్స్ హాల్లో జరిగిన సంఘ సమావేశంలో ఆనందరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. జనసేన రాష్ట్రసెక్రెటరీ బేతపూడి విజయ శేఖర్, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.