హత్య కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును బుధవారం ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గురువారం ఈ అంశం విచారణకు రానుంది. ఇటీవల గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సదరు హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సాక్షులను బెదిరించే అవకాశం లేదని బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.