మంగళగిరి: బోరుగడ్డ అనిల్ కు 14 రోజుల రిమాండ్
తుళ్ళూరులో ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలలో బోరుగడ్డ అనిల్ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దౌర్జన్యంతో పాటు ఏఎస్ఐ పై దాడి, ఓ దాబాలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తులపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులలో బోరుగడ్డను పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.