మంగళగిరి జాతీయ రహదారిలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం నియోజవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. కూటమి నేతలు పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ హనుమంతరావు, ఆప్కో మాజీ ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.