ఎన్ ఎస్ పి కాలువ మరమ్మత్తులు చేపట్టి, రైతులకు కాలువపై తిరగడానికి దారి ఏర్పాటు చేయాలని కోరుతూ పిడిఎం నాయకులు సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రం గ్రీవెన్స్ సెల్ లో అందజేశారు. వినుకొండ మండలంలో బ్రాహ్మణపల్లి నుండి విటంరాజుపల్లె, సాయిబాబా గుడి వరకు ఉన్న కాలువను వెంటనే మరమ్మత్తు చేసి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని వారు కోరారు.