నరసరావుపేట: వ్యక్తి బెదిరింపులపై ఎస్పీకి ఫిర్యాదు

72చూసినవారు
నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన ఏడుకొండలు గత మే నెలలో నకరికల్లు వద్ద నరసరావుపేటకి చెందిన శ్రీనివాసరావు క్రేన్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే పరిహారం అడిగితే శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్