భోగి పండుగ సందర్భంగా సోమవారం నరసరావుపేట పట్టణంలోని మద్ది రాఘవయ్య వారి వీధిలో కందకట్ల శ్రీరంగనాయకులు, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ భోగి మంటలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి పట్టణంలో ప్రజలు భోగి మంటలు వేసి ఆనందంగా పండుగ జరుపుకున్నారు. కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, యువతీ, యువకులు సంగీత నృత్య ప్రదర్శనలతో ఆనందంగా గడిపారు.