నరసరావుపేట పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో వర్షం నీరు నిలిచిపోవడం పై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే నీరు నిలిచిపోవడం చూసి అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులను వెంట బెట్టుకుని స్టేడియం మొత్తాన్ని పరిశీలించారు.