నరసరావుపేట: హాస్టళ్ల వసతులపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోని వసతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల సగం అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయన్నారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు వస్తే పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవన్నారు. సీఎం చంద్రబాబు స్పందించాలని ఎమ్మెల్యే కోరారు.