వీరమరణం పొందిన సైనికుడి ఫొటో లభ్యం

2934చూసినవారు
వీరమరణం పొందిన సైనికుడి ఫొటో లభ్యం
ఇండియా, చైనా దేశాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన పుట్టా సుబ్బారావు అనే సైనికుడు వీరమరణం పొందగా ఇన్నాళ్ళకు ఆయన ఫోటో లభ్యమయింది. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల ఫోటోలతో కూడిన స్థూపం ఏర్పాటు కోసం సైన్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారి సూచన మేరకు మార్టూరు ఎస్సై శ్రీనివాసరావు అన్ని రకాలుగా ప్రయత్నించి శనివారం సుబ్బారావు బంధువుల నుండి ఆయన ఫోటో సేకరించగలిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్