అమరావతిలోని అసెంబ్లీ నందు మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్పీకర్ అయ్యన్నపాత్రుడకు వివరించారు. అర్హులైన పేదవారికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఏలూరి తెలిపారు.