పెదకూరపాడు మండలం 75 త్యాల్లూరు జడ్పీ హైస్కూల్లో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. రాధాకృష్ణన్ తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించ బడ్డార ని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, తత్త్వవేత్తగా ఆయన సేవలను ఉపాధ్యాయురాలు అజిత వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఎస్.ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.