గోల్డ్ చైన్ అపహరణ చేసిన నిందితులను పట్టుకుంటామని గురువారం పెదకూరపాడు సీఐ సురేశ్ అన్నారు. చుండు సీతామహాలక్ష్మికి సంబంధించిన గోల్డ్ చైన్ అపహరణకు గురి అయిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్థానికులు చెప్పిన వివరాలను సేకరించి నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ అన్నారు. ఈ కార్యక్రమం ఎస్ఐ బాలు నాయక్, హెచ్ పీసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.