అమరావతి మండలం పంచరామ క్షేత్రాల్లో ప్రధమమైన శ్రీ అమరేశ్వరస్వామివారి దేవస్థానం, సందర్శించేందుకు శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో డివిజన్ పరిధిలోని పోలీసులు అమరావతి చేరుకొని ఉదయం నుంచి ప్రటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. శ్రీ బాల చాముండికా సమేత అమలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన రామనాథ్ కు స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.