ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పల్నాడు జిల్లా డిసిహెచ్ఓ రంగారావు అన్నారు. మంగళవారం పెద్దకూరపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. నిధులు వచ్చిన వెంటనే కొత్త బిల్డింగ్ లోకి ఆసుపత్రిని మార్చడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల సేవలను పెదకూరపాడు పరిసర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.