గుంటూరు, కృష్ణ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు పెదకూరపాడు నియోజకవర్గంలోని కూటమి పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం సాయంత్రం ధరణికోటలో జరిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు అందరిని ఓటర్లుగా చేర్పించే బాధ్యత కూటమి పార్టీలపై ఉందన్నారు.