పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు జెడ్పీ హై స్కూల్ లో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవంను జరిపారు. దివ్యాంగుల గౌరవంగా జీవిస్తూ అన్ని హక్కులు పొందేలా చూడటమే ఈష దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఎస్. ఇడి టీచర్ సిహెచ్ సుబ్బారావు అన్నారు.వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. దీనిలో హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, బాజీఖాన్, వెంకటరమణ, చైర్మన్ పున్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు.