గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేంచేసి ఉన్న తోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో బుధవారం నాలుగు నెలల కాల పరిమితికి హుండీ లెక్కింపు జరిగింది. బాపట్ల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎస్ కుమార్ బాబు ఆధ్వర్యంలో లెక్కింపు జరగగా రూ.1.8 లక్షల ఆదాయం వచ్చినట్లు ఇన్ స్పెక్టర్ కుమార్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నాగమల్లేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వెంకటేశ్వరరావు అర్చక స్వాములు పాల్గొన్నారు.