పొన్నూరు: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

60చూసినవారు
పొన్నూరు: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం జిబిసి రోడ్డు ప్రధాన రహదారిపై శనివారం ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం పొన్నూరు వైపు నుంచి ఒక కారు గుంటూరు వైపు నుంచి ఒక కారు వెళుతూ ఎదురెదురుగా ఢీకొన్నాయని తెలిపారు. ఈ ఘటనలో రెండు కార్లు ముందు భాగాలు ధ్వంసం అయ్యి కార్లలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్