గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెద గొట్టిపాడు గ్రామానికి చెందిన ధర్నాసి కార్తీక్ (22) ను గత నెల 28వ తేదీన తల్లిదండ్రులు చర్చికి వెళ్ళమని మందలించారు. దీంతో తల్లిదండ్రులను బెదిరించాలని ఉద్దేశంతో కార్తీక్ ఇంటిలో గడ్డి మందు తాగాడు. హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. తల్లి నిర్మల ఫిర్యాదు మేరకు ప్రతిపాడు ఏఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేశారు.