వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ 'చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం-అవగాహన’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం చిరుధాన్యాల ఉత్పత్తి, తయారు, తద్వారా ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ డాక్టర్ ఖాదర్ వలీ, డాక్టర్ సరళ ఖాదర్ రైతులు పాల్గొన్నారు.