యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రేపల్లె గ్రామీణ సిఐ సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎస్ వి ఆర్ ఎం కళాశాలలో మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగరం ఎస్ఐ భార్గవ్, పోలీస్ సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.