రాజుపాలెం మండలంలోని గణపవరంలో శ్రీదేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా గ్రామంలో పార్వతయ్య శర్మ ఆధ్వర్యంలో 9వ రోజు శుక్రవారం అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు, అష్టోత్తర శతనామావళి, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.