తుళ్లూరు శివారులోని బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తో కలిసి సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం సందర్శించారు. అక్కడ నిర్మించబోయే హాస్పిటల్ కు సంబంధించి సూచనలు, సలహాలను సంబంధిత సిబ్బందికి బాలకృష్ణ ఇచ్చారు. త్వరలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.