తుళ్లూరు మండల పరిధిలో నడిరోడ్డుపై ఎద్దుల కుమ్ములాట బుధవారం తెల్లవారు జామున జరిగింది. మసీదు సెంటర్ వద్ద రెండు ఎద్దులు ఒకదానికొకటి పోట్లాడుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కలుగజేసుకొని తరిమే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయిందని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, రోడ్లపై ఉండే ఆవులను గోశాల కు తరలించాలని అధికారులను బుధవారం ప్రజలు కోరుతున్నారు.