భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య వేధిస్తున్నాడంటూ భట్టిప్రోలు మండలం తాతవారి పాలెం గ్రామానికి చెందిన పడమట శేషగిరిరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టిన అక్రమ కేసులకు బాధ్యుడిని చేస్తూ ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. శేషగిరిరావును రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.