నేటి ప్రపంచంలో సాంకేతికపరమైన కంప్యూటర్ విద్య ఎంతో అవసరముందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎర్రయ్య అన్నారు. సోమవారం కొల్లూరు మండలంలోని ఫోర్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ నవీన్ పాల్ సహకారంతో ఎస్‌ఇన్ఫో కంప్యూటర్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఫోర్ ఫ్రెంట్ స్కూల్‌లో ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్యియిన విద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మురళీకృష్ణ, అంకమ్మరావు, కృష్ణంరాజు ఉన్నారు.