గ్రామ పంచాయతీ పారిశుద్ధి కార్మికుల సమావేశం ఆదివారం జరిగింది. కొల్లూరు పంచాయతీ కార్యాలయంలో వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పుల్లారావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు చాలీచాలని జీతాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి కార్మికుడికి 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలన్నారు. ప్రతి కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేసి యూనిఫామ్, నూనెలు, సోపులు, చెప్పులు ఇవ్వాలన్నారు. అనంతరం వర్కర్స్ యూనియన్ ను ఏర్పాటు చేశారు.