భట్టిప్రోలు: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో దేవాదాయ శాఖ పరిధిలో 70 లక్షల వ్యయంతో మంజూరైన సత్రం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవాలయాలు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్చకులకు ముఖ్య మంత్రి చంద్రబాబు బాసటగా నిలుస్తున్నాడని ఆయన చెప్పారు.