చుండూరు మండలం పెనుగు దూరుపాడు గ్రామానికి చెందిన బిరుదు లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ ఎమ్మెల్యే ఆనందబాబు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మంజూరైన 69 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును గురువారం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు ఆమెకు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిది బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు.