వేమూరులోని లక్ష్మీ పద్మావతి కళ్యాణ మండపం నందు సోమవారం నియోజకవర్గం స్థాయి టిడిపి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. సభ్యత్వంలో నమోదైన ప్రతి కార్యకర్తకు టిడిపిలో సంక్షేమ నిధితో పాటు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అన్నారు. కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో నమోదు కావాలని కోరారు.