యలవర్రులో రీ సర్వే పై గ్రామసభ

61చూసినవారు
యలవర్రులో రీ సర్వే పై గ్రామసభ
గతంలో భూములను రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన గ్రామసభలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని, రేపల్లె ఆర్. డి. ఓ, రామలక్ష్మి అన్నారు. అమృతలూరు మండల యలవర్రు గ్రామంలో బుధవారం సర్పంచ్ మండే నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఆర్డీవో పాల్గొని రైతులను గతంలో చేసిన రీ సర్వే విది విధానాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో, ఎంపిటిసి మానుకొండ ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్