కొరిశపాడు: లోన్లు తీసుకున్న వారికి చివరి అవకాశం

67చూసినవారు
కొరిశపాడు మండలంలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఆయా బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించిందని ఆయన తెలియజేశారు. 2,754 మంది రైతులకు గాను 1162 మంది రైతులు ప్రీమియం నగదును చెల్లించినట్లు శ్రీనివాసరావు చెప్పారు.

సంబంధిత పోస్ట్