రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారము నాణ్యత, క్యాంటీన్ నిర్వహణపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశం మేరకు మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారిశుద్ధ్యం టోకెన్ విధానము భోజనము నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు.