పెద్దాఆరవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందిన కొత్తపల్లి శివ, ఆరవీటి ఏడుకొండలు, కొత్తపల్లి మను ల మృతదేహాలకు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎరిక్షన్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాద ఘటనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.