ఏపీ జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో సతీష్‌కు జైలు నుంచి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నిందితుడు సతీష్‌ను విడుదల చేయాలంటూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. నిందితుడిని విడుదల చేయాలని చెప్పారు. ఆదివారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి సతీష్ విడుదల కానున్నాడు.