అతిసారానికి మరో ఇద్దరు బలి

56చూసినవారు
అతిసారానికి మరో ఇద్దరు బలి
విజయవాడలో అతిసారం మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలుషిత జలాలు తాగడం వల్ల ఇప్పటికే నగరంలో ఎనిమిది మంది చనిపోగా.. మరో ఇద్దరు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మొగల్రాజపురం అట్లూరి పరమాత్మవీధికి చెందిన గల్లా కోటేశ్వరరావు (60) వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. విజయవాడలోని కార్మికనగర్‌కు చెందిన నీరుడు రజని కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్