రాబోయే 2 లేదా 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. ఆదివారం అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది.