AP: రాజధాని అంశంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం(వైసీపీ) నిర్ణయం తీసుకుందని తెలిపారు. అప్పుడు రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఆంచాన వేశామన్నారు. ప్రస్తుతం రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స తెలిపారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.