మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

71చూసినవారు
మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పిలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. కాయలను ఎట్టి పరిస్థితుల్లో ఇసుక (లేదా) పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. నేల మీద ఆరబెడితే నేలలోని తేమ వల్ల బూజుపట్టే అవకాశం ఉంది. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసివేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్