AP: జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది.