AP: ప్రకాశం జిల్లా కాటూరిపారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు. అశోక్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసి.. అప్పుల పాలయ్యాడు. సంధ్య భర్త నుంచి విడాకులు తీసుకుని అన్న దగ్గరే ఉంటోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్.. చెల్లెలి పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. చెల్లెలు ప్రమాదంలో చనిపోతే.. రూ.1.20 కోట్లు తనకు వస్తుందని భావించాడు. ప్లాన్ ప్రకారం చెల్లెలిని చంపి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. ఈ ఘటన గతేడాది జరగగా.. పోలీసుల విచారణలో ఇప్పుడు బయటపడింది.